వికీలో వెతకడం

వికీపీడియాలో చాలా సమాచారం ఉంది. ఆ సమాచారమంతటికీ ద్వారం లాంటిది వెతుకుడు పెట్టె (సర్చ్ బాక్స్).

wikipedia_search

ఈ పెట్టెలో టైప్ చేస్తుండగానే ఆ అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యాసాలను సలహాలుగా చూపిస్తుంది. ఉదాహరణకు తెలుగు అని టైపు చెయ్యగానే తెలుగు భాష, తెలుగు వ్యాకరణం, తెలుగు సాహిత్యం,… ఇలా చూపిస్తుంది. వాటిల్లోంచి మనకు కావాల్సిన వ్యాసం మీద నొక్కితే ఆ వ్యాసానికి తీసుకు వెళుతుంది. లేదా వ్యాసం పూర్తి పేరును టైప్ చేసి ఎంటర్ నొక్కినా ఆ వ్యాసానికి తీసుకు వెళుతుంది.

ఒకవేళ మీరు ఇచ్చిన పేరుతో వ్యాసం లేకపోతే ఈ క్రింది విధంగా చూపిస్తుంది.

wiki_no_article

ముందుగా ఇచ్చిన పేరుకు దగ్గరగా ఏదైనా వ్యాసం ఉంటే ఒక వేళ ఆ వ్యాసం కోసం వెతుకుతున్నారేమో ఊహిస్తుంది. తరువాత ఎర్రటి అక్షరాలతో ఆ పేరుతో వ్యాసం సృష్టించడానికి ఓ లింకు ఇస్తుంది. ఒక వేళ మీరు ఆపేరుతో వ్యాసం రాయాలనుకుంటే ఆ లింకు మీద నొక్కి మీకు తెలిసిన సమాచారాన్ని చేర్చవచ్చు.

ఒక వేళ మీరు వెతుకుతున్న పేరుతో చాలా వ్యాసాలు గనక ఉన్నట్లయితే ఆ వ్యాసాలన్నింటికీ లంకెలతో కూడిన ఓ పేజీని చూపిస్తుంది. ఉదాహరణకు మీరు శ్రీనివాస్ అనే పేరుతో వెతికారనుకుందాం. అప్పుడు ఆ పేజీ ఇలా చూపిస్తుంది.

wiki_multiple_articles

ఇది సాధారణంగా వికీలో ఉన్న సమాచారం(విషయపు పేజీలు) వెతికే విధానం. వికీలో సమాచారమే కాక ఓ వ్యాసాన్ని రాస్తున్నపుడు జరిగే చర్చలు, సభ్యుల చర్చా పేజీలు, ప్రాజెక్టు పేజీలు, మొదలైనవన్నీ ఉంటాయి. వాటిలో వెతకడమెలాగో వచ్చే టపాలో తెలుసుకుందాం.

2 thoughts on “వికీలో వెతకడం

  1. తెవికీ బ్లాగు చాలా బాగున్నది. దీనివల్ల మరింత మంది వాడుకరులు క్రియాశీలకంగా మారి తెవికీ అభివృద్ధికి కృషి చేయగలరని భావిస్తాను. ఈ బ్లాగును యేర్పరచే ప్రయత్నం చేసిన రవిచంద్ర గారికి అభినందనలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s