అసలు వికీపీడియా అంటే ఏమిటి?

వికీపీడియా అంటే ఆన్‌లైన్ లో లభించే ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. విజ్ఞాన సర్వస్వం అంటే ప్రపంచ లో ఉండే అన్ని విషయాల గురించిన సమాచార భాండాగారం. వికీపీడియా అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండటమే కాక అందులో ఉన్న సమాచారాన్ని ఎవరైనా మార్చగలరు, కొత్త సమాచారాన్ని చేర్చగలరు. అందుకే ఇది స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం అయింది.

జనవరి 15, 2001 వ తేదీన జిమ్మీ వేల్స్, లారీ సాంగర్ లచే ప్రారంభించబడిన వికీపీడియా కొద్ది కాలానికే చాలా భాషల్లోకి విస్తరించింది. 2005 వ సంవత్సరంలో తెలుగు వికీపీడియా ప్రారంభమైంది. రెండు సంవత్సరాల పాటు బాలారిష్టాలతోనే కొనసాగిన తరువాత కొంతమంది బ్లాగర్ల సహకారంతో ఊపందుకుంది. ప్రస్తుతం తెలుగు వికీలో చిన్నా పెద్ద అన్నీ కలిపి సుమారు 50,000 వ్యాసాలున్నాయి. అదే ఆంగ్లంలో ఈ సంఖ్య సుమారు 42 లక్షలు. తెలుగు వికీలో వ్యాసాల సంఖ్య ఇంకా పెరగాల్సి ఉంది. అంతే కాకుండా ఉన్నా సమాచారాన్ని ఇంకా మెరుగులు దిద్దాల్సి ఉంది. అందుకు మీ అందరి సహకారం కావాలి. మీకు సహాయంగా సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఈ బ్లాగు ప్రారంభించడం జరిగింది.

ప్రకటనలు

One thought on “అసలు వికీపీడియా అంటే ఏమిటి?

  1. అందులో ఉన్న సమాచారాన్ని ఎవరైనా మార్చగలరు, కొత్త సమాచారాన్ని చేర్చగలరు. అందుకే ఇది స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం అయింది.

    స్వేచ్ఛ అనడానకి మరో ముఖ్యమైన పార్శ్వం: ఆ సమాచారాన్ని ఎవరైనా, ఎందుకోసమైనా (ముందస్తు అనుమతి లేకుండానే) వాడుకోవచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s